2176) ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ

** TELUGU LYRICS **

ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
దారి లోలగిన నా కొరకు ఎంత వేదనతో వేచితివి (2)
దూరాన నను చూడగానే పరుగెడుతు దరి చేరితివి
అపరాధిగానుండగానే నను ముట్టి ముద్దాడితివి
వందనము, వందనము
వందనము, వందనము యేసుయ్యకే వందనము
వందనము, వందనము నా రాజుకే వందనము
వందనము, వందనము శ్రీ యేసుకే వందనము

ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
అంటరాని వానిపై ఎంత ప్రేమ చూపించితివి (2)
నీ విలువైన రక్తంబును ధారలుగా చిందించితివి
సిలువలో ప్రాణంబును దానముగా అర్పించితివి
వందనము, వందనము
వందనము, వందనము యేసుయ్యకే వందనము
వందనము, వందనము నా రాజుకే వందనము
వందనము, వందనము శ్రీ యేసుకే వందనము

ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ నా రాజుని ప్రేమ
మరణము నను దాటిపోవాలని మరణించితివే నా బదులుగా (2)
మృతులను లేపినవాడవు మరణమును జయించితివి
నిత్యము జీవించుటకు నాకు మార్గమును చూపించితివి
వందనము, వందనము
వందనము, వందనము యేసుయ్యకే వందనము
వందనము, వందనము నా రాజుకే వందనము
వందనము, వందనము శ్రీ యేసుకే వందనము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------