2005) ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు

** TELUGU LYRICS **

    ప్రభు దయచేయు - నిత్య దీవెనలు బెరాకాలో చూతురు

1.  కీడు, యుద్ధము, తెగులు, కరువైనను
    దాడి చేయబూని విజృంభించి నపుడు
    నీవు మొరపెట్టిన నీకు దొరుకు - నిజముగా - రక్షణ

2.  శత్రు శోధనలు పై బడినప్పుడు
    శక్తిహీనులమై పోయినప్పుడు
    క్రీస్తు దయచేయు నిత్యాదరణ - నిజముగా - చూతురు

3.  ప్రభు యుద్ధము చీయు నాయకుడు
    ప్రభు పక్షమందు చీరుము యీనాడే
    నీవు పొందెదవు బెరాకాలో - నిజముగా - జయము

4.  పలువిధ శ్రమలందు చేరుమా
    ప్రీతిమీర మిమ్ము దరిచేర్చును
    నీతియుక్తముగా స్తుతించుము - ఖ్యాతితో ప్రభుని

5.  నిత్యదేవుని మహాకృప నిరతం
    శత్రువును జయించును నిశ్చయం
    కృతజ్ఞతా స్తుతులు మీరు - నిత్యముగా చెల్లించుడి

6.  స్వరమండల సితారా వాయించుడి
    శత్రువులతో ప్రభు పోరుసల్పెను
    బెరాకాలో ప్రభు స్వరమెత్తి - మరి మరి - పాడుడి

7.  పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది
    భూరాజులు గడగడ వణికిరి
    తన ప్రజలను సంతోషపరచును - హల్లెలూయ – పాడుడి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------