1976) పశువుల పాకలో దేవ కుమారుడు

** TELUGU LYRICS **

పశువుల పాకలో దేవ కుమారుడు
దీనుడై పుట్టెను మానవాళికి
ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి
గొల్లలు జ్ఞానులు పూజించిరి
మనసే పులకించెను క్రీస్తు జన్మతో
తనువే తరియించెను రాజు రాకతో
కొనియాడి కీర్తించెదము
పరవశించి ఆరాధించెదం

యుదయ దేశమున దావీదు పురమందు
శ్రీయేసు జనియించే దీన గర్భమున
పరలోకనాధుండు ధరణుద్భవించాడు
ఇమ్మానుయేలుగ నేడు తోడుగా ఉన్నాడు
రండి చూడగా వెళ్ళెదం రక్షకుని భజియించెదం
కనరండి తనయుని కొలిచెదం
ఉల్లాసముతో పాడెదం ఆనందముతో మ్రోక్కెదం
ఆదిసంభుతుని అర్భాటించెదం

భోళము సాంబ్రాణి బంగారు కానుకలు
సరిరావు ఎన్నటికీ అర్పించు నీ హృదయం
అక్షయుడు దేవుడు రక్షకుడు వచ్చాడు
మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవమనుగడకు
ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్త క్రీస్తు
బలవంతుడు అయినవాడు మారాజు
ఉల్లాసముతో పాడెదం ఆనందముతో మ్రోక్కెదం
ఆదిసంభుతుని అర్భాటించెదం

** ENGLISH LYRICS **

Pashuvula Paakalo Deva Kumaarudu
Dheenudai Puttenu Maanavaaliki
Aakaashaana Dhoothalu Paadi Sthuthinchiri
Gollalu Gnaanulu Poojinchiri
Manase Pulakinchenu Kreestu Janmatho
Thanuve Thariyinchenu Raaju Raakatho
Koniyaadi Keerthinchedhamu
Paravashinchi Aaraadhinchedham

Yudaya Deshamuna Dhaaveedu Puramandhu
Shree Yesu Janiyinche Dheena Garbhamuna
Paralokanaadhundu Dharanudhbhavinchaadu
Immanueluga Nedu Thodugaa Unnaadu
Randi Choodaga Velledham Rakshakuni Bhajiyinchedham
Kanarandi Thanayuni Kolichedham
Ullaasamutho Paadedham Aanandhamutho Mrokkedham
Aadhisambhoothuni Arbhaatinchedham

Bholamu Saambraani Bangaaru Kaanukalu
Sariraavu Ennatikee Arpinhu Nee Hrudhayam
Akshayudu Devudu Rakshakudu Vacchaadu
Mokshaanni Thicchaadu Ee Maanava Manugadaku
Aashcharyakarudu Yesu Aalochana Karth Kreestu
Balavanthudu Ayinavaadu Maaraaju
Ullaasamutho Paadedham Aanandhamutho Mrokkedham
Aadhisambhoothuni Arbhaatinchedham
-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------