1977) పశుల పాకలో పరలోక నాథుడు

** TELUGU LYRICS **

పశుల పాకలో పరలోక నాథుడు 
అరుదెంచేనే ఇలచూడు - అవని రక్షింప నేడు 
నింగిలోని దేవుడు నీకై దిగివచ్చెను చూడు 
ప్రణమిల్లు క్రీస్తుకు నేడు- మనకిక ఆయనే తోడు 

రక్షింపగ ఈ లోకం - విడిచాడు పరలోకం 
పరమతండ్రి ఆదేశం - కదిలాడు మనకోసం 
లోక రాజై తను పుట్టాడుగా
దాసునిగానే ఇలజీవించాడుగా 
గగన తారనే నడిచొచ్చిందిగా
లోక జ్ఞానమే తలదించిందిగా
కన్యక ఒడిలో పరిశుద్ధతనయుడు
పవళించెను చూడు -తరియింపగా నేడు  

సుందరముతనదేహం - అర్పింపగమనకోసం 
విలువైనది తన ప్రాణం - జీవమునకు అది మార్గం 
నూతన నిబంధనై తను వచ్చాడుగా
సత్యస్థాపనకై తను నిలిచాడుగా
పరమతండ్రినే తనుతెలిపాడుగా 
నిన్నునన్ను రక్షింప వచ్చెనుగా
కలువరి గిరిలో ప్రాణత్యాగమివ్వగా
రక్షకుడైవచ్చినా మన క్రీస్తుని చేరు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------