1902) పరమ తండ్రి నిన్ను మే మీ పరస కాలము

** TELUGU LYRICS **

    పరమ తండ్రి నిన్ను మే మీ పరస కాలము స్వరము లెత్తి యింపు
    గాను స్మరణఁ జేతుము 
    ||పరమ||

1.  నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో హరువుగా నుతింతు మేము
    హర్స రవముతోఁ
    ||పరమ||

2.  అవని సంభ్రమములలోన నవఘళించము అవసరముగ నీదు పలుకు
    నవధరింతుము
    ||పరమ||

3.  వేయి నాళ్లు లోకమునను వెలయుకంటెను శ్రేయ మొక్కనాఁడు నిన్ను
    సేవ జేయుట
    ||పరమ||

4.  ఉచితమైన నీ గృహమున నచల భక్తితో రుచిరమైన నీదు ప్రేమ
    రుచినిజూతుము
    ||పరమ||

5.  మనసునందు సత్యబోధ మనస్కరించుచు మనెడు తరిని విడము నీదు
    ఉనికిపట్టును
    ||పరమ||

6.  గొరియ పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితోఁ గొరత లేక చేతు మెపుడు
    గొనబు గానము
    ||పరమ||

7.  శాంతజలము నొద్ద మమ్ము శాంతి పరచుము సంతతమును నీవు
    మమ్ము సంతరించుము
    ||పరమ||

8.  దినము లన్ని మేము నిన్ను దీన మనసుతో వనరు మాని సంతసమున
    వినతి చేతుము
    ||పరమ||

** ENGLISH LYRICS **

Parama Thandri Ninnu Me Me Parasa Kaalamu Swaramu Letthi Impu
Gaanu Smaranan Jethumu
||Parama||

1. Nirupamaana Deva Ninnu Niratha Prematho Haruvugaa Nuthinthu Memu
Harsa Ravamuthon
||Parama||

2. Avani Sambhramamulalona Navaghalinchamu Avasaramuga Needu Paluku
Navadharinthumu
||Parama||

3. Veyi Naallu Lokamunanu Velayukantenu Shreya Mokkanaadu Ninnu
Seva Jeyuta
||Parama||

4. Uchithamaina Nee Gruhamuna Nachala Bhakthitho Ruchiramaina Needu Prema
Ruchini Joothumu
||Parama||

5. Manasunandhu Sathyabodha Manaskarinchuchu Manedu Tharini Vidamu Needu
Unikipattunu
||Parama||

6. Goriya Pilla Yokka Prema Goorchi Bhakthithon Koratha Leka Chethu Mepudu
Gonabu Gaanamu
||Parama||

7. Shaanthajalamu Noddha Mammu Shaanthi Parachumu Santhathamunu Neevu
Mammu Santharinchumu
||Parama||

8. Dinamu Lanni Memu Ninnu Dheena Manasutho Vanaru Maani Santhasamuna
Vinathi Chethumu
||Parama||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------