1903) పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై

** TELUGU LYRICS **

    పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే - పాపి కొరకై

1.  వినుము సోదరా - వింతవార్తను దేవదేవుడే - త్యాగమాయెను
    ఆ - దేవుడే దయతో నన్ను వెదకి వచ్చెగా

2.  కల్వరి ప్రభున్ - గాంచు సోదరా వ్రేలాడెను - యేసునాథుడు
    నా - పాపముల్ సిలువలో మోసె నేసు కల్వరిన్

3.  దేహమంతయున్ - గాయమొందెనే నా రోగమున్ బాగుచేసెనే
    నా శాపమున్ బాపెను మోసె నెల్ల బాధలన్

4.  మహిన్ ప్రేమచే - మహిమ విడచెనే - మాత వలెనే - మమ్ము బ్రోచెనే
    ఇ - మ్మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే

5.  యేసు ప్రభుకై - ఏమి చేతును - దీన మనసుతో - సేవజేతును
    నన్ - నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------