2081) పాడుదును క్రీస్తు పేర పదము నెంతో

** TELUGU LYRICS **

    పాడుదును క్రీస్తు పేర పదము నెంతో వేడుదు నా దివ్యాగురు నివ్విధముఁ
    జూడఁజూడ మదిలో నెంతో వేడుకగా మీఱె వింత ఱేడుఁ బోలినవా
    డిహ లేఁడు లేఁడందు నహహా 
    ||పాడుదును||

1.  పెక్కు పాపములలోన మణఁగి నాదు తక్కువ బుద్ధిచే నందణఁగి దిక్కు
    గానక నుండు వేళ దిక్కయి చనుదెంచి మరల గ్రక్కున కరముఁ జూచి
    చక్కికిఁ జేర్చి ప్రోచె
    ||పాడుదును||

2.  మోసపు లోక వాంఛలను వట్టి యాశలతోఁ గూడికొన్న కలలు
    రోసితిఁ గాన వాని యేసుతోఁ గూడుకొంటి వీసమైనను లేమి లేశము
    లేదనుస్వామి
    ||పాడుదును||

3.  పాయ నెన్నటికిని వాసిగాఁ బాస త్రోయను త్రోయను యని చేసెగా
    రోయక న న్నావిభుఁడు సాయమై రక్షించు నెపుడు నా యనీతి భయములు
    మాని యాయనే జయంజయమని
    ||పాడుదును||

4.  చాలు చాలు పాపమా నీ చెలిమి నిత్య కాలము గలిగించు మృత్యుకలిమి
    యేలికైన నాయిమ్మాను యేలు నాయందు దయను మేలిమి
    నగుపరచినట్టి జాలినేఁ గంటిఁ గాన
    ||పాడుదును||

5.  ధరలో దేనికి భయపడను ఎట్టి తరుణమైనను చేయి విడను
    కరుణామయుండు నన్ను కరుణ నేర్పరచి మున్ను మరణమందును వాని
    శరణం నాశరణమని
    ||పాడుదును||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------