1601) నిన్ను విడువను నేను అందరు నిన్ను విడచినను

** TELUGU LYRICS **

    నిన్ను విడువను నేను
    అందరు నిన్ను విడచినను
    నిన్ను ఎన్నడు ఎడబాయను నేను

1.  యేసుని పొలములో పనిచేసెడి
    దాసులందరికిదే వాగ్దానము
    ఆత్మల పంట - కోయునపుడు
    మీతో నుందును నేను

2.  దుష్టుడు - నిరుత్సాహ - పరచును
    కష్టపడినను - ఫలితము - లేదని
    యిష్టముగా - పనిచేయుము
    నీవు శ్రేష్ఠుడొసగును - జయము

3.  కాయమునందు - విత్తిన - నీవు
    క్షయమను - పంటను - కోతువు
    ఆత్మీయముగా - విత్తిన
    కోతువు - నిత్య జీవపు పంట

4.  మానవులను - లెక్కించకుము
    ప్రాణుల - ప్రభుకై సంపాదింప
    నిను కృంగఁజేయు - నిష్మాయేలెప్పుడు
    కనుమిస్సాకులో - జయము

5.  మనకు మాదిరి - క్రీస్తునుంచెను
    తన స్వరూపమునకు - మారునట్లు
    మనము - ప్రభుని పోలునట్లు
    ఆత్మ చేయున్ - మనలన్

6.  మనదు స్వార్థము - పోవునట్లు
    ఆయనతో - శ్రమపడుటయే - మార్గము
    క్రీస్తు - స్వరూపమేర్పడు
    మనలో - అగ్నిపరీక్ష - యందు

7.  జలములలో - దాటునపుడు
    జ్వాలలందు నడచునపుడు
    బలముగా మీకుతోడై యుండి
    నిలిపెదను - నా దృష్టి

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------