1774) నీవు నా దేవుండవై యున్నావు యేసు నాధ

** TELUGU LYRICS **

    నీవు నా దేవుండవై యున్నావు యేసు నాధ నీవిలఁ బ్రోవవే నన్నుఁ
    గావవే 
    ||నీవు||

1.  పాప మానవ శాప భారము నోపి సిల్వను బడిన క్షేమా ధిపతి
    సర్వ భూపతి
    ||నీవు||

2.  శ్రేయమౌ కా యంబు భక్తుల కీయ సిద్ధముఁ జేయు యేసు
    నాయకా మోక్ష దాయకా
    ||నీవు||

3.  జీవ మారెడి త్రోవ నేఁబడి చావనై యున్నాను పతిత పావనా యాత్మ
    జీవనా
    ||నీవు||

4.  జాగుసేయక బాగుసేయను రాఁగదె నే ఘోర పాప రోగిని దఃఖ
    భాగిని
    ||నీవు||

5.  పాపమున నా రూపు మాపితి ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా
    కృపను జూపవా
    ||నీవు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------