1736) నీ మాట నా పాటగా అనుక్షణం పాడనీ

** TELUGU LYRICS ** 

    నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
    లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
    నా గీతం ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ కలిగించి - నీలోనే ప్రహర్షించనీ

1.  ఏ చోట గళమెత్తినా - నీ ప్రేమ ధ్వనియించనీ
    పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ (2)
    వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
    స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
    నా గీతం ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ కలిగించి - నీలోనే ప్రహర్షించనీ

2.  నీ దివ్య గానామృతం - జలధారలుగా పొంగనీ
    తాకేటి ప్రతి వారినీ - ఫలవంతముగా మార్చనీ (2)
    శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
    నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
    నా గీతం ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ కలిగించి - నీలోనే ప్రహర్షించనీ

3.  ఆత్మీయ గీతాలతో - తనువంతా పులకించనీ
    సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ (2)
    కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
    హృదయాల్లో నివసించుచూ - కార్యాలు జరిగించనీ
    నా గీతం ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ కలిగించి - నీలోనే ప్రహర్షించనీ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------