2489) మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక

** TELUGU LYRICS **

    మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక
    పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున 
    ||మేలుకొనరే||

1.  దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెను
    మ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూల కర్తకుఁ గొలువసేయఁగ
    ||మేలుకొనరే||

2.  పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెను
    రక్షకుని సకలోపకృతులను రమ్యముగ నుతియించి పాడఁగ
    ||మేలుకొనరే||

3.  నిదుర బోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండక
    పదిలముగ రక్షించు దేవునిఁ బ్రస్తుతింప మహాముదంబున
    ||మేలుకొనరే||

4.  మేటియౌ హృదయాబ్జములలో మీ కృతాజ్ఞతా భూషణంబులు
    నేటుగా ధరియించుకొని యిటు నిర్మలాత్మునిఁ బూజసేయఁగ
    ||మేలుకొనరే||

5.  తెల్లవారఁగఁ దెలియరే యిది తెలివిగల మానవ సమాజము
    యల్లసిల్లుచు నీతి భాస్కరుఁడుదయ మయ్యెను హృదయముల పై
    ||మేలుకొనరే||

** ENGLISH LYRICS **

Melukonare Mee Manambula Melimiga Mee Mera Thappaka
Paalu Maalaka Lechi Devuni Paadhamulu Poojimpa Grakkuna
||Melukonare||

1. Dhikku Lellanụ Dhejharillenu Dhinakaruńdudhayimpanayyenu
Mrokkulaku Prathiphalamu Nichchedu Moola Karthaku Koluvaseyaga
||Melukonare||

2. Pakshulellanụ Kilakilanchunu Prabhuni Mahimalu Balka Thodangenu
Rakshakuni Sakalopakruthulanu Ramyamuga Nuthiyinchi Paadaga
||Melukonare||

3. Nidhura Boyina Vela Mimmonka Nimishayinanụ Baasiyundaka
Padhilamuga Rakshinchu Devuni Prasthuthimpa Mahaamudhambuna
||Melukonare||

4. Metiyau Hrudhayaabjamulalo Mee Kruthaagnathaa Bhooshanambulu
Netugaa Dhariyinchukoni Itu Nirmalaathmuni Poojaseyaga
||Melukonare||

5. Tellavaaraga Teliyare Idhi Telivigala Maanava Samaajamu
Yallasilluchu Neethi Bhaaskarududhaya Mayyenu Hrudhayamula Pai
||Melukonare||
-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------