2490) మేలుకొని యిక లేచి యేసుని మేలులన్

** TELUGU LYRICS **

    మేలుకొని యిక లేచి యేసుని మేలులన్ వేనోళ్ల బాడరే బాలబాలికలారా
    చాలా పాడరే వేలపాడరే 
    ||మేలు||

1.  పక్షి గణములు కూడి దేవుని ప్రేమ నెల్లను పొగడుచున్నవి బాపహరుడగు
    క్రీస్తు చెంతకు పారుమా రక్షణ కోరుమా
    ||మేలు||

2.  అరుణరాగము వెల్లి విరిసెను ఆకసంబున జుక్కలణగెను తరుణ
    ముననే లేచి దేవుని కెఱగుమా దీవెన కరుగుమా
    ||మేలు||

3.  తెల్లవారెను లోకమెల్లను తెలివిగొని మున్ముందు దేవుని తల్లి దండ్రియు
    గురుడవీవని దలచుచూ తగధ్యానించుమా
    ||మేలు||

4.  జగములెల్లను జంతుజాలము ల గణితంబగు జీవులెల్లను సొగసున
    న్వేనోళ్ల బొగడుట జూడుమా నీవును పాడుమా
    ||మేలు||

5.  నీతి భాస్కరుడుదయమాయెను నూతనోజ్జీవన మొసంగను సతత మాతని
    దాపున న్వసియించుమా తగ జీవించుమా
    ||మేలు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------