** TELUGU LYRICS **
మన్నించుమా - మన్నించుమా -
మన్నించుమా - దేవా - మన్నించుమా
మాట తప్పాను - నిన్ను మరిచాను
క్షమియించి నన్ను బ్రోవుమా
కాదనక నన్ను కావుమా
||మన్నించుమా||
ఆదాము పాపమును - క్షమియించినావే
చర్మపు వస్త్రమును - నిర్మించినావే
కడపటి ఆదామై - ఏతెంచినావే
ఈ పాపి కొరకై - రిక్తునిగా మారావే
ఇంత చేసిన నీవు - నాయెడల మౌనమా
చెంత చేరిన నన్ను - కాదనకు ప్రాణమా
||మన్నించుమా||
దావీదు పాపమును - క్షమియించినావే
ఆ మరణ శాసనము - రద్దు చేసినావే
దావీదు పట్టణమందు - నాకొరకె పుట్టావే
ఈ ఘోరపాపి కొరకే - బలియాగమయ్యావే
ఇంత చేసిన నీవు - నాయెడల మౌనమా
చెంత చేరిన నన్ను - కాదనకు నేస్తమా
||మన్నించుమా||
-----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee vunte Chaalunaya (నీ వుంటే చాలునయా)
-----------------------------------------------------------------------------