** TELUGU LYRICS **
మనుజులార మంచి వార్త – మానుగాను దెచ్చినాడ
మనలన్ గావ మహిని నేడు – మనుజుడై జన్మించె నహహ
మనలన్ గావ మహిని నేడు – మనుజుడై జన్మించె నహహ
1. ఎంతో సంతసంబు గలిగె – నింతయని వర్ణింప దరమా
చింతలన్ని వీడి ప్రభుని – చెంతజేరి నుతించుమయ్యయ్యో
||మనుజులారా||
2. బేతలేము పురమునందు – బీద యింట స్థలములేక
దాత పశులశాలయందు – బ్రీతితో బరుండె నయ్యయ్యో
||మనుజులారా||
3.ఒక్క క్షణములోనే దూతల్ – గ్రక్కున మోక్షంబు విడచి
ఒక్క స్వరముతోను బాడి – మక్కువ నుతించిరయ్యయ్యో
||మనుజులారా||
4. సంతసంబని తాళములతో – యేసు జన్మదినమునందు
సంతసంబు సంతసంబు – సంతసంబని బాడు డహాహా
||మనుజులారా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------