2344) మనసానందముఁ బొందుట కన్నను మరి

** TELUGU LYRICS **

    మనసానందముఁ బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్న
    అనుమానము లిఁక సఖిల సుఖంబులు దిన మొక గడికొక తీరై
    యుండును 
    ||మన||

1.  దిటముగఁ ప్రార్థన యను ఖడ్గముఁ గని తిరుగు పిశాచము వెఱ చన్న
    పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పం కము నింకించును
    ||మన||

2.  సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి
    స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను సుఖమే మున్నది 
    ||మన||

3.  తనువున దానను వానికి దురితము దగిలెడు విధిఁ గనవలె నన్న
    యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభముఁ గని విశ్వాసముఁ గట్టిగఁ బెంచిన
    ||మన||

4.  క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిఁక భువి లేరన్న
    సమదృష్టి జగ జ్జనుల గనుంగొను సత్క్రైస్తవులకు సాధన మనఁ దగు
    ||మన||

5.  పరమదయానిధి క్రీస్తుని బలమునఁ బాప భరంబులు విడు నన్న
    పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీఁకటు లన్నియుఁ దొలఁ
    గును
    ||మన||

** ENGLISH LYRICS **

Manasaanandhamu Pondhuta Kannanu Mari Ae Bhaagyamu Gala Dhanna
Anumaanamu Lika Sakhila Sukhamulu Dhina Moka Gadikoka Theerai
Yundunu
||Mana||

1. Dhithamuga Praarthana Yanu Khadgamu Gani Thirugu Pishaachamu Verachanna
Patudeepthulu Gala Prabhu Shaastrokthulu Bahu Samshaya Pankamu Ninkinchunu
||Mana||

2. Saadhu Janotthama Kraisthava Sangathi Samakoodina Maelau Nanna Shodhana Lanniti
Sthiramuga Norchedi Shubhamathi Kannanu Sukhamae Munnadhi
||Mana||

3. Thanuvuna Dhaananu Vaaniki Dhurithamu Dhagiledu Vidhi Ganavale Nanna
Yonara Ga Christuni Vadhyaasthambhamu Gani Vishwaasamu Gattiga Benchina
||Mana||

4. Kshamayunu Snehamu Prabhukada Nerchina Shathruvu Lika Bhuvi Leranna
Samadrushti Jaga Jjanula Ganungonu Satkraisthavulaku Saadhana Mana Dhagu
||Mana||

5. Paramadhayaanidhi Christuni Balamuna Paapa Bharambulu Vidu Nanna
Parishuddhaathmuni Bandhuthvambuna Aramara Cheekatu Lanniyu Tholagunu
||Mana||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------