2362) మమతానురాగాలే మాలలుగా సమతానుబంధాలే ఎల్లలుగా

** TELUGU LYRICS **

    మమతానురాగాలే మాలలుగా
    సమతానుబంధాలే ఎల్లలుగా
    కట్టబడిన కాపురం - అనురాగ గోపురం
    ఈ పరిణయం - యెహోవా నిర్ణయం

1.  వరుడైన క్రీస్తు వధువైన సంఘమును
    ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించె
    అటువలెనే పురుషుడు కూడా తన స్వంత దేహమువోలె
    భార్యను ప్రేమించ వలెనని యేసయ్య ఏర్పరచినది

2.  కుమారుడు క్రీస్తు శిరస్సైన తండ్రికి
    అన్నివేళలందు విధేయత చూపె
    అటువలెనే స్త్రీ కూడా శిరస్సైన పురుషునికి
    అన్నిటిలో విధేయురాలిగ ఉండునట్లు ఏర్పరచినది

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------