2238) భక్తులారా దుఃఖక్రాంతుడు వచ్చె మహిమతోడ

** TELUGU LYRICS **

1.  భక్తులారా దుఃఖక్రాంతుడు - వచ్చె మహిమతోడ
    విజయుడగాన మోక - రించుటకు పూజ్యుడు
    మకుటము తలనుంచి - అభిషిక్తున్ జేయుడు - మకుటము

2.  పరలోక మార్భటింప - దూతలారా కొల్వుడి
    సింహాసనమునందు రాజు - నభిషక్తున్ చేయుడి
    మకుటము తలనుంచి - రాజరికమీయుడి - మకుటము

3.  పాపుల్ ముండ్ల మకుట మీయ - గరక్షితు లెల్లరు
    చుట్టు నిల్చి స్తుతిపాడి - యేసు పేరుపొందుడి
    మకుటము తలనుంచి - జయము ప్రకటించుడి - మకుటము

4.  యేసు మహోన్నతు డాయెన్ - హా! మహాసంతోషము
    ఆర్భటించు పాట న్విని - గొప్పగా స్తుతించుడి
    మకుటము తలనుంచి - డీ రాజాధిరాజుకు – మకుటము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------