** TELUGU LYRICS **
భక్తుల సంఘమే - ప్రభుని శరీరము
అందాయన తన - పూర్ణత నింపును
అందాయన తన - పూర్ణత నింపును
1. ఒక్క శరీరమునకు - శిరస్సు నొకటేగా
సంఘమునకు ప్రభువే - శిరస్సుగా
సంఘమునకు ప్రభువే - శిరస్సుగా
2. శిరస్సునుండే యోచనలు వెలువడును
శరీరము నందు - ప్రకటింప బడున్
శరీరము నందు - ప్రకటింప బడున్
3. యూదులని హెల్లే - నీయులనిలేదు
దాసులనియు స్వతం - త్రులనియు లేదు
దాసులనియు స్వతం - త్రులనియు లేదు
4. కలవు శరీరములో - అనేకావయవముల్
కలసి ఏకముగా - నివసించుచుండున్
కలసి ఏకముగా - నివసించుచుండున్
5. కరములు కాళ్ళతో - కలహించలేవు
కలయకనే కార్య-మును చేయలేవు
కలయకనే కార్య-మును చేయలేవు
6. ఆత్మైక్యత నవ - యవములు కలిగిన
క్షేమాభివృద్ధిని - దేహము బొందున్
క్షేమాభివృద్ధిని - దేహము బొందున్
7. శిరస్సాధీనములో - సర్వాంగములుండిన
సేవలో ప్రభు పరి-పూర్ణత యుండును
సేవలో ప్రభు పరి-పూర్ణత యుండును
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------