462) ఎవరు భాగ్యవంతు లౌదు రవని

** TELUGU LYRICS **

    ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు
    బోధ చెవులొగ్గి వినువారికన్న 
    ||ఎవరు||

1.  కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దవులఁ
    బోవఁ దరిమి యేసు తత్వముఁగొనువారికన్న
    ||ఎవరు||

2.  దీనమానసుల కట్టి యుప దేశ మిచ్చెను దివ్య మైన మోక్ష రాజ్యము
    వారి దౌనటంచు ప్రభువు తెల్పె
    ||ఎవరు||

3.  వృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ నోదార్పుఁ
    బొంది నిత్య సంతోషింతు లని తెల్పె
    ||ఎవరు||

4.  శాంతి నీతికరుణల యందా సక్తిగల వారు భూస్వతంత్రులై పరి తృప్తినొంది
    దయఁ బడసెద రని ప్రభువు తెల్పె
    ||ఎవరు||

5.  పరిశుద్ధ హృదయులు పరా త్పరునఁ జూతురు సర్వ నరుల
    సమాధానపరచు నరులె పరమ జనకుని సుతులు
    ||ఎవరు||

6.  నీతికొర కాపద నొందెడి నిశ్చ లాత్ములు వారు ఖ్యాతిగఁ బర లోక
    రాజ్య ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు
    ||ఎవరు||

** ENGLISH LYRICS **

Evaru Bhaagyavanthu Laudhu Ravani Lopala Moksha Vivaramaina Kreesthee
Bodha Chevuloggi Vinuvaarikanna
||Evaru||

1. Kavulu Laabha Marasi Cheyu Kapata Manthramul Vidhulu Dhavula n
Bova n Tharimi Yesu Thathvamu n Gonuvaarikanna
||Evaru||

2. Dheenamaanasula Katti Upa Desha Micchenu Dhivya Maina Moksha Raajyamu
Vaari Dhounatanchu Prabhuvu Thelpe
||Evaru||

3. Vrujinamulakai Dhukhinchedi Sujanu Levvaro Vaaru Nijamuga Nodhaarpu n
Bondhi Nithya Santhoshinthu Lani Thelpe
||Evaru||

4. Shanthi Neethi Karunala Yandhaasakti Gala Vaaru Bhoosvathanthrulai Pari Thrupthinondhi
Dhaya n Badashedha Rani Prabhuvu Thelpe
||Evaru||

5. Parishuddha Hrudhayulu Paraa Thparuna n Joothuru Sarva Narula
Samaadhaanaparachu Narule Parama Janakuni Suthulu
||Evaru||

6. Neethikora Aapadha Nondhedi Nishcha Laathmulu Vaaru Khyaathiga n Para Loka
Raajya Ghana Soukhyamu Lellanu Badayudhuru
||Evaru||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post