488) ఏ పాటిదో నా జీవితం ఎలాంటిదో ఆ నా గతం


** TELUGU LYRICS **

ఏ పాటిదో నా జీవితం - ఎలాంటిదో ఆ నా గతం 
ప్రభు యేసులో నా జీవితం - మారిపోయేగా ఆ నా గతం 
నన్ను ప్రేమించినా - నాకై మరణించినా 
నన్ను విడిపించినా యేసుకే... (2) 
ప్రభుయేసు నీకే స్వాగతం - మారిపోయేగా ఆ నా గతం (2) 
||ఏ పాటిదో||

ఎందుకో పుట్టానని - నా బ్రతుకే దండగని (2) 
పనికిరాని వాడనని - పైకి అసలే రాలేనని 
పదిమంది ననుచూసి గేలి చేయువేళ... ఆ.. ఆ.. 
పనికొచ్చే పాత్రగా నను చేసినా - పరిశుద్ధునిగా నను మార్చినా 
యేసయ్యా నీకే స్తోత్రము - మెస్సయ్యా నీకే స్తోత్రము (2) 
||ఏ పాటిదో||

అందచందాలు లేవని - చదువు సంధ్యలే అబ్బని (2) 
తెలివి తక్కువ వాడనని - లోక జ్ఞానమే లేదని
పదిమంది నను చూసి గేలి చేయువేళ.... ఆ.. ఆ..
పరిశుద్ధాత్మతో నను నింపినా - సిలువ సాక్షిగా నను మార్చినా 
యేసయ్యా నీకే స్తోత్రము - మెస్సయ్యా నీకే స్తోత్రము (2)
||ఏ పాటిదో||

---------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Krupa Chaalunaya (నీ కృప చాలునయా)
---------------------------------------------------------------------------