556) ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భారమయ్య రావే

** TELUGU LYRICS **

    ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భారమయ్య రావే 
    ||ఓ దేవా||

1.  స్వామి స్వామి యన నా భారం ప్రేమఁ జూపను నీ భారం పామరుఁ
    డ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం
    ||ఓ దేవా||

2.  నెనరు తండ్రి యన నా భారం ననుఁ గనులఁ జూడను నీ భారం నిన్నే
    నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం
    ||ఓ దేవా||

3.  కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం శరణని వే
    డను నా భారం సంతరింప నీ భారం
    ||ఓ దేవా||

4.  మనవి సేయ నాది భారం తనవిఁ దీర్పను నీ భారం నిను మది దలఁ
    ప గ నా భారం నన్ను గా వనీ భారం
    ||ఓ దేవా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------