795) కొనుము మా హృదయంబులను

** TELUGU LYRICS **

    కొనుము మా హృదయంబు లను నీకర్పించెద మనయము నుతి
    యించుచు ఘనముగాఁ గృపచేత మముఁ గా చినను మే మెంతయు
    ననర్హుల మనుచు నీ పాదముల కెరగుచు ననిశమును నీ కృపఁ
    దలంతుము 
    ||కొనుము||

1.  బలహీనులము మేము బలవంతుఁడవు నీవు బల మిచ్చి మము
    నడుపుము ఇలను మే మిఁక బ్రతుకు దివనం బులను నీ పద భక్తిచే
    నెపుడలయ కుండగ మమ్ముఁ గడు ని ర్మలిన హృదయులఁ జేసి కరుణను
    ||కొనుము||

2.  ఘోరారణ్యము భువి వి చార సంకలితము భూరి భయంకరము దారి
    లేదిఁక నీవు దప్ప వేరె సాధన మెచెటఁ గానము కోరి మము నందరిని
    నీదరి జేరుకొను మార్గమును జూపు
    ||కొనుము||

3.  గత వత్సరమున నీ యతులమౌ కృపచేత పతితుల మముఁ గాచితి
    వతి వినమ్రుల మగుచు మామా మతులలో నీ ప్రేమఁ దలఁచుచు మతి
    విహీనతే వీడి యిఁక నిను సతతతము సేవింతు మయ్య
    ||కొనుము||

4.  ఈ వత్సరంబున నెవ్వరు మాలోన పోవుదు రిలను విడిచి దేవ
    వారలు భువిని వదలి పోవు కాలమునందుఁ దిన్నని త్రోవలో వారలను
    సుఖముగఁ బ్రోవఁ దొడ్కొని పోవు మయ్య    
    ||కొనుము||

5.  మమ్మును విశ్వాస మార్గమందున దోడ నిమ్ముగఁ గొని పోవుచు
    నమ్ము నీ ప్రియ సేవకుల బృం దమ్మునకు సిద్ధంబులగు మకు టమ్ములను
    మే మొందుటకు వే గమ్ముగాఁ బాత్రులను జేసి
    ||కొనుము||

6.  శోధనల యందున బాధల యందున నోదార్పు మా కొసఁగుము
    శోధనలచే మాకు మరియును శుద్ధమగు హృదయంబు లిచ్చుచు శోధనల్
    ఫలియిపంఁ జేయుము బాధకమ్ములు గాక యుండఁ
    ||కొనుము||

7.  ఈ లోక దుఃఖము లెల్ల నేగిన పిదప నీ లోకమును జేరఁగఁ
    పాలుమాలక మేము మామా పరుగు నెత్తఁగు సాయ మిమ్మో యేలికా నీ
    కరములను మ మ్మెపుడు గొని నడువంగ నేర్పు
    ||కొనుము||

8.  దురితంబు లెల్లను గరుణచేఁ గడిగి నీ పరమందు మము జేర్పుము
    నిరతమును మే మచట నీ కృప విరివి నెంతయు బొగడుచును మా
    కరములను బంగారు వీణెల వెరవుగాఁ గొని మీటుచుందుము
    ||కొనుము||

** ENGLISH LYRICS **

Konumu Maa Hrudhayambu Lanu Neekarpincheda Manayamu Nuthi
Yinchuchu Ghanamugaaఁ Grupachaetha Mamuఁ Gaa Chinanu Mae Menthayu
Nanarhhula Manuchu Nee Paadhamula Keraguchu Nanishamunu Nee Krupaఁ
Dhalamthumu 
||Konumu||

1. Balaheenulamu Maemu Balavamthuఁdavu Neevu Bala Micchi Mamu
   Nadupumu Ilanu Mae Miఁka Brathuku Dhivanam Bulanu Nee Padha Bhakthichae
   Nepudalaya Kunda-ga Mammuఁ Gadu Ni Rmalina Hrudhayulaఁ Jaesi Karunanu
   ||Konumu||

2. Ghoraaranyamu Bhuvi Vi Chaara Samkalithamu Bhoori Bhayamkaramu Dhaari
   Laedhiఁka Neevu Dhappa Vaerae Saadhana Mechetaఁ Gaanamu Kori Mamu Nandharini
   Needhari Jaerukonu Maargamunu Joopu
   ||Konumu||

3. Gatha Vathsaramuna Nee Yathulamau Krupachaetha Pathithula Mamuఁ Gaachithi
   Vathi Vinamrula Maguchu Maamaa Mathulalo Nee Premaఁ Dhalaఁchuchu Mathi
   Viheenathaee Veedi Yiఁka Ninu Sathathathamu Saevinthu Mayya
   ||Konumu||

4. Eee Vathsarambuna Nevvaru Maalona Povudhu Rilanu Vidichi Dhaeva
   Vaaralu Bhuvini Vadali Povu Kaalamunanduఁ Dhinnani Throvalo Vaaralanu
   Sukhamugaఁ Brovaఁ Dhodkoni Povu Mayya    
   ||Konumu||

5. Mammunu Vishwaasa Maargamandhuna Dhoda Nimmugaaఁ Goni Povuchu
   Nammu Nee Priya Saevakula Brundhammuna-ku Siddhambulagu Maku Thammulanu
   Mae Monduhtaku Vae Gammugaaఁ Baathrulu Jaesi
   ||Konumu||

6. Shodhanala Yandhuna Baadhala Yandhuna Nodhaarpu Maa Kosagu-mu
   Shodhanalachae Maaku Mariyunu Shuddhamagu Hrudhayambu Licchuchu Shodhanal
   Phaliyimpaఁ Jaeyumu Baadhakammulu Gaaka Yundaఁ
   ||Konumu||

7. Eee Loka Dhukhamu Lella Naegina Pidhapa Nee Lokamunu Jaeraఁgaఁ
   Paalumaalaka Maemu Maamaa Parugu Netthagu Saaya Mimmou Yaelika Nee
   Karamulanu Ma Mmepudu Goni Naduvamga Naerpu
   ||Konumu||

8. Dhurithambu Lellanu Garunachaeఁ Gadhigi Nee Paramandu Mamu Jaerpumu
   Nirathamunu Mae Machata Nee Krupa Virivi Nenthayu Bogadhuchunu Maa
   Karamulanu Bangaaru Veenela Veravugaaఁ Goni Meetuchundhumu
   ||Konumu||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------