** TELUGU LYRICS **
కొనియాడబడును యెహోవాయందు భయభక్తులు గల వనిత
తనవారికైన పగవారికైన పంచును సమత మమత
తనవారికైన పగవారికైన పంచును సమత మమత
1. ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు
ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు
కలిగిన భార్య ఇంటికి దీపము
సంఘమనే ఆ వధువునకు నిజమైన రూపము
2. తండ్రివలె ఓదార్చి తల్లివలె సేదదీర్చి
మిత్రునివలె భర్తకు ఎప్పుడు తోడుగ నిల్చును
దైవ జ్ఞానముతో కుటుంబమును నడుపును
రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును
3. బ్రతుకు దినములన్నియును భర్తకు మేలే చేయును
దీనులకు దరిద్రులకు తన చేయిచాపును
ఆహారమును తానే సిద్ధపరచును
ఇంటివారినందరిని కనిపెట్టుచుండును
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------