955) జగతికి పునాది వేయక ముందే జనియించిన ప్రేమ

** TELUGU LYRICS **

జగతికి పునాది వేయక ముందే జనియించిన ప్రేమ
జగతిలో నేను పుట్టకముందే నన్నెరిగిన ప్రేమా నన్నెరిగిన ప్రేమ
నన్నెరిగిన ప్రేమ ఏర్పరుచుకున్న ప్రేమ
నన్నెరిగిన ప్రేమ నన్నెన్నుకున్న ప్రేమ

గర్భమునా పుట్టినది మొదలు నన్ను భరించిన ప్రేమ
తల్లి ఒడిలో కూర్చున్నది మొదలు చంకబెట్టిన ప్రేమ
చిరుప్రాయమునుండీ ముసలితనమువరకూ
యెత్తుకున్నప్రేమ హత్తుకున్న ప్రేమ
యెత్తుకున్న ప్రేమ నా యేసు ప్రేమ
యెత్తుకున్న ప్రేమా ఆ ఆ ఆ నా యేసు ప్రేమ 
||జగతికి||

దూరస్తునిగా ఉన్నపుడు నను సంధించిన ప్రేమ
దారితొలగి తిరిగినయపుడు నను సమకూర్చిన ఫ్రేమ
మార్గము చూపించి మందలో నను చేర్చి
మార్గము చూపించి మందలో నను చేర్చి
సంధించిన ప్రేమ సమకూర్చిన ప్రేమ
సందించిన ప్రేమా నా యేసు ప్రేమ
సమకూర్చిన ప్రేమ నా యేసు ప్రేమ
||జగతికి||

రక్షనపాత్రను అందించ రక్తముకార్చిన ప్రేమ
ముండ్లను శిరమున ధరియించి మకుటమునిచ్చిన ప్రేమ
నిరుపేదగ నిలచీ నన్ను ధనవంతుని చేసి
నిరుపేదగ నిలచీ నిను ధనవంతుని చేసి
రక్షించిన ప్రేమ రక్తం చిందించిన ప్రేమ
రక్షించిన ప్రేమా రక్తం చిందించిన ప్రేమ
||జగతికి||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------