** TELUGU LYRICS **
గీతములు పాడుఁడీ యేసునికి సంగీతములు పాడుఁడీ పాతకుల
మగు మనల దారుణ పాతకము తన విమలరక్త స్నాతులనుగాఁ జేసి
పాపను భాతకులలో నవతరించెను
మగు మనల దారుణ పాతకము తన విమలరక్త స్నాతులనుగాఁ జేసి
పాపను భాతకులలో నవతరించెను
||గీతములు||
1. రాజులకు రాజుగా నేలుచు మోక్ష రాజ్యమున కర్తగా బూజలందుచు
దూత పరిగణ పూజితుండౌ ఘనుఁడు తన దగు తేజ మెల్లను విడిచి
యీయిలఁ దేజహీనులలోనఁ బుట్టెను
దూత పరిగణ పూజితుండౌ ఘనుఁడు తన దగు తేజ మెల్లను విడిచి
యీయిలఁ దేజహీనులలోనఁ బుట్టెను
||గీతములు||
2. దాసులగు వారలన్ దమ పటు దోష త్రాస విముక్తులన్ జేసి వారల
నెల్ల మోక్ష ని వాసులుగఁ జేయంగ రక్తముఁ బోసి కృపచేఁగావ వచ్చెను
యేసు నాధుఁడు దీన వృత్తిని
2. దాసులగు వారలన్ దమ పటు దోష త్రాస విముక్తులన్ జేసి వారల
నెల్ల మోక్ష ని వాసులుగఁ జేయంగ రక్తముఁ బోసి కృపచేఁగావ వచ్చెను
యేసు నాధుఁడు దీన వృత్తిని
||గీతములు||
3. మానవుల కెల్లను దేవుని ప్రేమ మానుగాఁ జూపను మ్రానిపై దన
రక్త మొసఁగఁగ మానవుండై పుట్టె యూదుల లోన యేసను పేరుచేఁదా
దీనుఁడై యిమ్మానుయేలు
3. మానవుల కెల్లను దేవుని ప్రేమ మానుగాఁ జూపను మ్రానిపై దన
రక్త మొసఁగఁగ మానవుండై పుట్టె యూదుల లోన యేసను పేరుచేఁదా
దీనుఁడై యిమ్మానుయేలు
||గీతములు||
4. ఆదిఁ దన వాక్యము నందున యేసు మోదమున్ నిట్లనెన మేదినిందా
మనుజుఁడై యిఁక సాదరమ్మునఁ బ్రోవ మనుజుల నా దయాళుఁడు
తనదు దేహము సాధుగా నర్పింతు ననుచును
4. ఆదిఁ దన వాక్యము నందున యేసు మోదమున్ నిట్లనెన మేదినిందా
మనుజుఁడై యిఁక సాదరమ్మునఁ బ్రోవ మనుజుల నా దయాళుఁడు
తనదు దేహము సాధుగా నర్పింతు ననుచును
||గీతములు||
** ENGLISH LYRICS **
Geethamulu Paadundee Yesuniki Sangeethamulu Paadundee Paathakula
Magu Manala Dhaaruna Paathakamu Thana Vimalaraktha Snaathulanugaa Jaesi
Paapanu Bhaathakulalo Navatharinchenu
||Geethamulu||
1. Raajulaku Raajugaa Naeluchu Moksha Raajyamuna Karthaga Boojalandhuchu
Dhootha Parigana Poojithundau Ghanundu Thana Dagu Thaeja Mellanu Vidichi
Yeeyila Thaejaheenulalona Butthenu
||Geethamulu||
2. Dhaasulagu Vaaralan Dhama Patu Dhosha Thraasa Vimukthulan Jaesi Vaarala
Nella Moksha Ni Vaasulugaa Jaeyanga Rakthamu Bosi Krupachae Gaava Vacchenu
Yesu Naadhudu Dheena Vrutthini
||Geethamulu||
3. Maanavula Kellanu Dhaevuni Prema Maanugaa Joopanu Mraanipai Dhana
Raktha Mosagaga Maanavundai Putthe Yoodhula Lona Yesanu Paeruchae Thaa
Dheenudai Immaanuyaelu
||Geethamulu||
4. Aadhi Dhana Vaakyamu Nandhuna Yesu Modhamun Nitlanena Maedhinindhaa
Manujudai Ika Saadharammuna Brova Manujula Naa Dhayaalundu
Thanadhu Dhaehamu Saadhugaa Narpinthu Nanuchunu
||Geethamulu||
---------------------------------------------------------------
CREDITS :
---------------------------------------------------------------