417) ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ

** TELUGU LYRICS **    

    ఎందుకయ్యా యేసయ్యా నా పై ఇంత ప్రేమ (2)
    పాపిని నాకొరకు నీకు ఏల సిలువ శ్రమ (2)

1.  శ్రీమంతుడవు సిరికే రాజువు - 
    ప్రార్థించినంతనే కృప చూపువాడవు(2) 
    కడు దీనుడవై మరియ సుతుడవై (2)
    పశుల శాలలో జన్మించినావా 
    నాకై ఇంత తగ్గించుకున్నావా 
    ||ఎందుకయ్యా||

2.  న్యాయము జరిగించు శాసనకర్తవు 
    న్యాయాధిపతిగా రానున్నవాడవు (2) 
    లోకాధికారుల తీర్పుకు తలవంచి (2) 
    దొంగల నడుమ మరణించినావా 
    నాకై ఇంత తగ్గించుకున్నావా
    ||ఎందుకయ్యా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------