** TELUGU LYRICS **
ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు అక్షయు డేసిటు బలికె
అతిముదమునను వినరండి
అతిముదమునను వినరండి
||ద్రాక్షా||
1. నాయందుండని తీగె నాశనమొందును నిజము నాశనమొందక మీరు
నాయందుండుడి ఫలియింపన్
||ద్రాక్షా||
2. ఫలముల నివ్వని తీగె పనికిరాదని నరికి పారవేయంబడును నిరతము
తధ్యము నిప్పులలో
2. ఫలముల నివ్వని తీగె పనికిరాదని నరికి పారవేయంబడును నిరతము
తధ్యము నిప్పులలో
||ద్రాక్షా||
3. ఫలించు ప్రతి తీగె ఫలముల పెక్కుగ నివ్వన్ పరిశుద్ధి చేయబడున్
యెఱుగరే మీరది అనవరతం
3. ఫలించు ప్రతి తీగె ఫలముల పెక్కుగ నివ్వన్ పరిశుద్ధి చేయబడున్
యెఱుగరే మీరది అనవరతం
||ద్రాక్షా||
4. నాయందుండినగాని నయమగు కాపుండదిలన్ నాయందుండిన వాడు
నాణ్యపు ఫలములనిచ్చు నాహా
4. నాయందుండినగాని నయమగు కాపుండదిలన్ నాయందుండిన వాడు
నాణ్యపు ఫలములనిచ్చు నాహా
||ద్రాక్షా||
5. మీరు యేదియు చేయ లేరు నాకు వేరై వేరుగ మీరుండినచో
వెంటనే యెండిపోయెదరు
5. మీరు యేదియు చేయ లేరు నాకు వేరై వేరుగ మీరుండినచో
వెంటనే యెండిపోయెదరు
||ద్రాక్షా||
6. కాన యేసుని యందు మానకనుందుము స్వేచ్ఛన్ మాన్యుడేసుని
పలుకుల్ మదిదలచెద మిల మరువకను
6. కాన యేసుని యందు మానకనుందుము స్వేచ్ఛన్ మాన్యుడేసుని
పలుకుల్ మదిదలచెద మిల మరువకను
||ద్రాక్షా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------