** TELUGU LYRICS **
దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన యెహోవా
స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర
స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర
||దేవా||
1. సార కారుణ్యపారా వారా సర్వజ్ఞ నిర్వి కారా యేసు
నామావతారా దీన జనోపకారా ఘోరమైన సంసారటవిఁ
బడి దారిఁ గనని ననుఁ జేరఁబిలిచితివి
||దేవా||
2. అక్షీణ విభవానంద మోక్ష రాజ్య మహిమాధ్యక్ష సంతత
సుజన రక్షా కపట దుర్మనుజ శిక్షా పక్ష విపక్ష విలక్షణ రహిత
కటాక్షము నాదెస దీక్షను నిలుపవె
2. అక్షీణ విభవానంద మోక్ష రాజ్య మహిమాధ్యక్ష సంతత
సుజన రక్షా కపట దుర్మనుజ శిక్షా పక్ష విపక్ష విలక్షణ రహిత
కటాక్షము నాదెస దీక్షను నిలుపవె
||దేవా||
3. సుందరాశ్చర్య గుణ బృందా బంధుర నిత్యానందా సాధు
సజ్జన వంద్యా ఖందిత కలుష బృందా మంద మతిని నా
దెందము కడుఁదెలి వొందఁ జేసి నీ యందు నిలుపఁ గదె
3. సుందరాశ్చర్య గుణ బృందా బంధుర నిత్యానందా సాధు
సజ్జన వంద్యా ఖందిత కలుష బృందా మంద మతిని నా
దెందము కడుఁదెలి వొందఁ జేసి నీ యందు నిలుపఁ గదె
||దేవా||
4. నీవు నన్ను సృష్టించి నావు నా గురురాడ్దేవుఁ డవు క్రీస్తు యేసుని
చావు వలన నన్మనిపి నావు పావన జనక సుతాత్మలతోడను
గేవల మొక్కఁడ వై వెలిఁగెడి ప్రభు
4. నీవు నన్ను సృష్టించి నావు నా గురురాడ్దేవుఁ డవు క్రీస్తు యేసుని
చావు వలన నన్మనిపి నావు పావన జనక సుతాత్మలతోడను
గేవల మొక్కఁడ వై వెలిఁగెడి ప్రభు
||దేవా||
5. ప్రేమ స్వరూప నిత్య క్షేమ పతిత పావన నామ దాస లోకాబ్ధి
సోమ సర్వేశ పరమ ధామ నేమ మెఱుంగని నీచుఁడ
నధముఁడ నోమహాత్మ దయతో మన్నింపవె
5. ప్రేమ స్వరూప నిత్య క్షేమ పతిత పావన నామ దాస లోకాబ్ధి
సోమ సర్వేశ పరమ ధామ నేమ మెఱుంగని నీచుఁడ
నధముఁడ నోమహాత్మ దయతో మన్నింపవె
||దేవా||
** ENGLISH LYRICS **
Deva Divyanantha Prabhava Maampaahi Ghana Yehovah
Sthaavara Jangama Sahitha Nikhila Jaga Dhaavana Paavana Bhaava Niranthara
||Deva||
1. Saara Kaarunyapaaraa Vaaraa Sarvagna Nirvi Kaaraa Yesu
Naamaavathaaraa Deena Janopakaaraa Ghoramaina Samsaarathavin
Badi Daarin Ganani Nanu Cherabilichithivi
||Deva||
2. Aksheena Vibhavaanantha Moksha Raajya Mahimaadhyaksha Santhatha
Sujana Rakshaa Kapata Durmanuja Shikshaa Paksha Vipaksha Vilakshana Rahitha
Kataakshamu Naadhesa Deekshanu Nilupave
||Deva||
3. Sundharaashcharya Guna Brundaa Bandhura Nithyaanantha Saadhu
Sajjana Vandyaa Khanditha Kalusha Brundaa Mandha Mathini Naa
Dhendhamu Kadu-Theli Vondha Jesi Nee Yandhu Nilupa Gadhe
||Deva||
4. Neevu Nannu Srushtinchi Naavu Naa Gururaad-Devun Davu Kreestu Yesuni
Chaavu Valana Nanmunipi Naavu Paavana Janaka Suthaatmalathodanu
Gevala Mokkada Vai Veligedi Prabhu
||Deva||
5. Prema Swaroopa Nithya Kshema Pathitha Paavana Naama Daasa Lokaabdhi
Soma Sarvesha Parama Dhaama Nema Merungani Neechuda
Nadhamuda Nomahaathma Dayatho Mannimpave
||Deva||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------