6113) ఊహకందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవసించుగానమే నీవు లిరిక్స్ | Oohakandani Premalona Bhaavame Neevu Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

ఊహకందని ప్రేమలోన భావమే నీవు
హృదయమందు పరవసించుగానమే నీవు
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు
మరపురాని కలల సౌధం గురుతులేనీవు
ఎడబాయలేనన్నానిజ స్నేహమేనీవు
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు
||ఊహకందని ప్రేమ||

1. తల్లడి తల్లే తల్లి కన్నా మించిప్రేమించి
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది (2)
అదియే ఆ ఆ ఆ నే గాయపరచిన వేళలో
కన్నీరు కార్చిన ప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చిఆదరించిన ప్రేమయే
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే (2)
||ఊహకందని ప్రేమ||

2. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా (2)
అదియే.. ఆ ఆ ఆ తన మహిమ విడిచిన త్యాగము
ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే
నీ సర్వమిచ్చిన దాతవు
నను హత్తుకున్న స్వామివి (2)
||ఊహకందని ప్రేమ||

3. దేహమందు గాయమైతే కుదుట పడును కదా
గుండె గాయము గుర్తుపట్టిన నరుడు లేడుకదా (2)
నీవే నీవే యేసయ్య
నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు
ననుభుజముపైన మోసినఅలసిపోని ప్రేమవు
నీవు లేనిదే నా బ్రతుకులో
విలువంటూ లేనే లేదయ్యా (2)
||ఊహకందని ప్రేమ||

** ENGLISH LYRICS **

Oohakandani Premalona Bhaavame Neevu
Hrudayamandu Paravasinchu Gaaname Neevu
Manasu Nindina Ramyamaina Gamyame Neevu
Marupurani Kalala Soudham Guruthuleneevu
Edabaayalenaannaanija Snehameneevu
Nee Prema Kougililo Aanandame Neevu
||Oohakandani Prema||

1. Talladi Talle Thalli Kanna Minchipreminchi
Thanuvu Theere Varaku Nannu Viduvalenandi (2)
Adiye Aa Aa Aa Ne Gaayaparachina Velalo
Kanneeru Kaarchina Premagaa
Nulivecchanaina Odiki Cherchi Aadarinchina Premaye
Nee Gundelo Nanu Cherchina Nee Amaramaina Premaye (2)
||Oohakandani Prema||

2. Ningi Nelanu Kalipina Balamaina Vaaradhigaa
Nela Korigina Jeevithanni Levanettenugaa (2)
Adiye.. Aa Aa Aa Thana Mahima Vidichina Thyaagamu
Ee Bhuviki Vachchina Bhaagyamu
Nanu Daatipoka Vedakina Nee Madhuramaina Premaye
Nee Sarvamichchina Daathavu
Nanu Hatthukunna Swaamivi (2)
||Oohakandani Prema||

3. Dehamandu Gaayamaithe Kuduta Padunu Kada
Gunde Gaayamu Gurthupattina Narudu Ledukada (2)
Neeve Neeve Yesayya
Naa Antharangamu Tharachi Choosina Gaadhamaina Premavu
Nanubhujamupaina Mosina Alasiponi Premavu
Neevu Lenide Naa Brathukulo
Viluvantu Lene Ledayyaa (2)
||Oohakandani Prema||

-----------------------------------------------
CREDITS : 
-----------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post