5810) యేసయ్యలో నీ గుడారము క్షేమము యేసయ్యలో

** TELUGU LYRICS **

యేసయ్యలో నీ గుడారము క్షేమము
యేసయ్యలో నీ గిన్నె నుండి పొర్లును (2)
ఏ తెగులు నిన్ను సమీపించదు
అపాయము ఏదియు దరిచేరదు (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2)

నీతిమంతుడైన నోవాహు ఇంటిని
లోకమంతా నీట మునిగిన కాపాడిన దేవుడు (2)
యేసయ్యను నమ్మిన వారు సిగ్గునొందరెనడు
నీవు నీ ఇంటి వారు దీవించబడెదరు (2)
తగిన కాలమందు నిన్ను హెచ్చించును యేసు (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2)

భక్తి పూర్ణుడైన కొర్నేలి ఇంటిని
దైవజనుడి రాకతో దర్శించిన దేవుడు
మరిచిపోడు ఎన్నడు నీ భక్తిని యేసుడు
నీవు చేయు ప్రార్థనలు ఆలకించుచున్నాడు
తగిన కాలమందు నిన్ను దర్శించును

---------------------------------------------------------
CREDITS : Music : Moses Dany
Lyrics, Tune, Vocals : Rajesh Joshua
---------------------------------------------------------