** TELUGU LYRICS **
నీ దీవెనలవల్లనే నాకీస్థితి ప్రాప్తించినదే
నా శక్తి యుక్తితో ఇది సాధ్యపడదే
ఈ ఘనతంతా యేసూ నీదే
అ ప : కరుణించి నీవే క్రియ చేసినావే ప్రియుడా నా యజమానుడవే
నా శక్తి యుక్తితో ఇది సాధ్యపడదే
ఈ ఘనతంతా యేసూ నీదే
అ ప : కరుణించి నీవే క్రియ చేసినావే ప్రియుడా నా యజమానుడవే
నేను చేరలేని ఉన్నత స్థానములు అధిరోహించగజేసితివే
త్రోయబడ్డ నన్ను స్వీకరించి
వేలమందికొరకు ఎన్నుకుంటివే
నేను చూడలేని నూతన సంగతులు సందర్శించగజేసితివే
భంగపడ్డ నన్ను ఆదరించి
నిందతీసి ఘనతనిచ్చియుంటివే
భంగపడ్డ నన్ను ఆదరించి
నిందతీసి ఘనతనిచ్చియుంటివే
నేను మోయలేని విస్తృత బాధ్యతలు నిర్వర్తించగ జేసితివే
కూలబడ్డ నన్ను ప్రోత్సహించి
పూనుకున్న పనిలో తోడుగుంటివే
కూలబడ్డ నన్ను ప్రోత్సహించి
పూనుకున్న పనిలో తోడుగుంటివే
--------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music, Vocals : Dr. A.R. Stevenson
--------------------------------------------------------------------------------------------