5848) సర్వాధిపతియైన దేవా నిను పాడి కీర్తింతును

** TELUGU LYRICS **

సర్వాధిపతియైన దేవా నిను పాడి కీర్తింతును 
మహోన్నతుడా యెహోవా కొనియాడి ఘనపరుతును 
ఆశ్చర్యకరుడా నా ప్రాణ ప్రియుడా 
నీ కృపను ధ్యానించును అనుదినము స్తుతియింతును

నీ వంటి నమ్మదగిన దేవుడెవరు లేరయ్య 
నమ్ముకుంటే నిత్యజీవము ఇచ్చువాడవు నీవేనయ్య (2)
సర్వశక్తిమంతుడా సాత్వీకుడా 
దీనమనస్సు కలిగిన ప్రేమపూర్ణుడా

నీవంటి మార్పులేని దేవుడెవరు లేరయ్య 
నిన్ననేడు ఏకరీతిగా ఉన్నవాడవు నీవేనయ్య (2)
త్రియొక దేవుడా సత్యవంతుడా 
ఇహపరములలో పూజనీయుడా

నీవంటి పరిశుద్ధ దేవుడెవరు లేరయ్య 
శాశ్వతుడా నీకుసాటి ఎవరూలేనే లేరయ్య (2)
ఆరాధనీయుడా అద్వితీయుడా 
మరణము గెలిచిన సజీవుడా

------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music : Dr. M. Moses
Vocals : Bro. Nissy John, Dr.M.Moses
------------------------------------------------------------------------