** TELUGU LYRICS **
ప్రేమా ప్రేమా - ప్రేమకు నిలయమా
ఏ స్థితిలోనైనా మరువని ఆదరణకర్తవు
ఆధారమా ఆశ్రయమా ఆనందమా నా అతిశయమా
ఎండిపోయిన ఎడారిలో నా జలనిధివైనావు
నీ జీవ ఊటలు నాలోన ప్రవహింపచేసావు
కష్టకాలమైనను నీ కృప నన్ను మరువలేదు
దుఃఖసమయమైనను నీ ప్రేమ వీడలేదు
నీవే… నీవే.... నా ఆధారమ
నీవే… నీవే.... నా ఆశ్రయమ
నీవే… నీవే.... నా ఆనందమ
నీవే… నీవే.... నా అతిశయమ
||ప్రేమా ప్రేమా||
శత్రుదాడిలో ఓడిపోక విజయమునిచ్చావు
నా బలహీనతలో ధైర్యమునిచి నన్ను బలపరిచావు
నీలోనే నన్ను దాచావు నీ హస్తము తోడుంచావు
కునుకక నిద్రించక అరచేతిలో నన్ను దాచావు
నీవే… నీవే.... నా ఆధారమ
నీవే… నీవే.... నా ఆశ్రయమ
నీవే… నీవే.... నా ఆనందమ
నీవే… నీవే.... నా అతిశయమ
||ప్రేమా ప్రేమా||
నీ ఆత్మలో దినదినము నూతన పరిచావు
మధురమైన నీ మాటలతో నన్ను జీవింపచేశావు
అలసిన వేళలో ఆదరణను చూపావు
ఘనమైన నీ ప్రేమలో నా అడుగులు స్థిరపరచావు
నీవే… నీవే.... నా ఆధారమ
నీవే… నీవే.... నా ఆశ్రయమ
నీవే… నీవే.... నా ఆనందమ
నీవే… నీవే.... నా అతిశయమ
||ప్రేమా ప్రేమా||
----------------------------------------------------
CREDITS :
----------------------------------------------------