5850) నీవు నీ దాసుని ఎరిగియుంటివి ఇంకేమని నీతో మనవి చేతును

** TELUGU LYRICS **

నీవు నీ దాసుని ఎరిగియుంటివి 
ఇంకేమని నీతో మనవి చేతును (2)
నీ దాసుని నిమిత్తమే నీ చిత్తము ప్రకారమే 
ఈ ఘనతను కలుగజేసినావయ్యా (2)
దేవా నా యేసయ్య  నీ దృష్టికిది స్వల్ప విషయమే 
నాకైతే కనుల కన్నీరు ఆగవే 

నాశనమను గోతి నుండి నన్ను పైకి లేపితివి 
చీకటిలో నుండి నీ వెలుగులోకి పిలిచితివి (2)
నీ మహిమ గుణములను ప్రకటించువానిగా ఆ.. ఆ.. ఆ (2)
రాజులా యాజకునిగా - నీ దయ పాలించితివి 

నా ప్రార్థనలన్నిటినీ నీ సన్నిధి చేరనిచ్చి 
నా శత్రువులందరికీ తీర్పు తీర్చుచున్నావు (2)
నిత్య సంతోషమిచ్చే అభిషేక నాథుడా.. ఆ.. ఆ.. ఆ (2)
ఓటమే నేనెరుగని జయజీవితమిమ్మయ్య

నీ సన్నిధి నుండునట్లు నీ దాసుని సంతతిని 
ఆశీర్వదింపుమయ్య నిత్యము కృప పొందునట్లు (2)
నీవు దీవించినా నాశనమే ఉండదయ్యా ఆ.. ఆ..ఆ (2)
నిత్యము నీ బిడ్డనై ఆనందింతునయ్యా 
మహిమలో నీ సొంతమై పరిపాలింతునయ్యా

-----------------------------------------------------------------
CREDITS : Music : Prasanth Penumaka
Lyrics, Tune, Vocals : Bro. Raju Pallikonda
-----------------------------------------------------------------