** TELUGU LYRICS **
ప్రేమ మూర్తి త్యాగమూర్తి
సిలువలో నాకై రక్తము కార్చినావా
పంఛ గాయములు నాకై పొందినావా
అయ్యో యేసు నాధా నా కోసమే నీ సిలువ యాగము
సిలువలో నాకై రక్తము కార్చినావా
పంఛ గాయములు నాకై పొందినావా
అయ్యో యేసు నాధా నా కోసమే నీ సిలువ యాగము
నా పాపము కొరకు నీవు శ్రమపొందితివి
విలువగు రక్తము కార్చి నాకు రక్షణిచ్చితివి
సిలువకు శత్రువునైన నన్ను
మిత్రునిగా మార్చితివి
మితిలేని ప్రేమ చూపించితివి
తండ్రీ వీరేమి చేయుచున్నారోయని
వీరిని క్షమియించుమని ప్రాధేయపడితివి
క్షమించుటకు సిద్ధమనస్సు కలిగిన
అందరికి క్షమియించుట నేర్పిన (2)
యేసయ్యా నీకే మా స్తుతి స్తోత్రములు
మూడవ దినమున నీవు మృతిని గెలిచి లేచితివి
ముద్రవేయబడిన సమాధి ని చీల్చుకొని
లేఖనములు నెరవేర్చుటకు తండ్రి చిత్తము చేయుటకు (2)
పునరుత్థానుడవై తిరిగి లేచినావయ్యా అయ్యో
లేఖనములు నెరవేర్చుటకు తండ్రి చిత్తము చేయుటకు (2)
పునరుత్థానుడవై తిరిగి లేచినావయ్యా అయ్యో
--------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Yesudas Dara
Vocals & Music : Nissy John & P. Ashok
--------------------------------------------------------------