5787) నీవు కార్చిన రక్తంలో నేను ఉన్నానయ్యా

** TELUGU LYRICS **

నీవు కార్చిన రక్తంలో నేను ఉన్నానయ్యా 
నిన్ను చీల్చిన మనుషులలో నేనొకడినయ్యా
నమ్ముతూ వచ్చావు నాకోసం (2)
నమ్మకద్రోహిక మారాను ఈ లోకం కోసం 
పాపపు లోకం కోసం (2)
||నీవు కార్చిన||

ఏ కల్మషం లేని నీ హృదయాo 
నీకు చేశాను గాయం (2)
లోకపు దారులలో పాపపు 
అంచులలో నిన్ను మరచి నడిచాను (2)
నీ ప్రేమను మరచి నీ చేయిని విడచి 
నీకు దూరమైపోయాను (2)
నీ సిలువ చెంతకు చేరాను 
||నీవు కార్చిన||

ఏ పాపము ఎరుగని నీ పయనం 
నాకై కార్చిన నీ రుధిరం (2)
సిలువలో ఘోరంగా నాకై ఆహారంగా 
మిగిలావు బలి అయ్యావు (2)
చేదు బానిసనయ్య మూగ సాక్షునినయ్య
నీ పక్షాన నిలువక పోయాను (2)
క్షమియిoచ్చి నీ రాజ్యములో చేర్చుమయ్య 
||నీవు కార్చిన||

------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Padala Suresh Babu
Vocals & Music : Ravi Yangala & Vijay Samuel
------------------------------------------------------------------------