5823) పరలోక రాజ్య పందేంలో గెలుపే ఎవ్వరిదో

** TELUGU LYRICS **

పరలోక రాజ్య పందేంలో గెలుపే ఎవ్వరిదో
విజయాన్ని పొందే మార్గంలో విజేతలెవ్వరో
పరలోక రాజ్య పందేంలో గెలుపే ఎవ్వరిదో
పందెపు రంగంలో ఉన్న విశ్వాసులెందరో
ఎవరు? ఎవరు? ఎవరు? గెలిచే వీరులెవరు
పాపపు సంకెళ్లను తెంచి పరిగెత్తేవారెవరు
ఎవరు? ఎవరు? ఎవరు? పడిపోయే వారెవరో 
అపవాదిని ఎదిరించే బలమున్న వారెవరు

పరిగెత్తు పరిగెత్తు ఆ పందెంలో గెలిచెటట్టు
గురిపెట్టు గురిపెట్టు నీ లక్ష్యాన్ని చేధించేట్టు 

క్రీస్తునే విడిచినాడు ధనమునే నమ్మినాడు 
సిరిని ఆశించి ఆ యూదా ఉరిలో చిక్కుకున్నాడు  
ధన గాలమేసి దెయ్యం గంతులేస్తు వున్నడు
చీకటి అలజడినే రేపి నీ దారినే  మార్చాడు 
వాక్యమే దీపమై నీ అడుగులకు దారిచూపదా
క్రీస్తు నీ తోడుంటే ఆ విజయం నిన్ను వరించదా

లోకాన్ని నీకు చూపి - పరలోకాన్ని మరిపించి
పరమునకు వెళ్లకుండా పాపములొ ముంచెనే విరోది
శరీరాశలను చూపి అంధునిగా నీ బ్రతుకు మార్చి 
చెర పట్ట నిన్ను వల వేసి నన్ను తిరుగుతుంది  అపవాది
గురిలేని నీ జీవితం ఉరి యెద్దకనీ తెలుసుకో 
దుష్టుని క్రియలను జయించి క్రీస్తువలె సాగిపో 

గరుడ పక్షినే పోలి గగనములో ఎరను గురిపెట్టినట్టు
అశ్వమల్లె  అలసిపోక ఆ బహుమానముకై పరుగెట్టు
పందెమందు పడిపోక  ఎందరున్న ఓడిపోక
పరీక్షలెన్నైనా ఆ పౌలు వలె పరిగెట్టు 
లోకాన్నే జయించిన జయశాలినే ధరించుకో 
తండ్రితో నీవు ఉండుటకు పరలోకం చేరుకో

-------------------------------------------------------------------------
CREDITS : Lyrics : R. Rajesh
Music & Vocals : Gideon Katta & Rithish G Rao
-------------------------------------------------------------------------