5824) పరాక్రమవంతుడు నా పక్షమునున్నాడు విజయము నాదేగా

** TELUGU LYRICS **

పరాక్రమవంతుడు నా పక్షమునున్నాడు 
విజయము నాదేగా 
సైన్యములకు అధిపతి తన సొత్తని అన్నాడు 
సంతసించి పాడేదను 
క్రొత్త కీర్తనతో - స్తుతి గానముతో నిన్ను కొనియాడేదను 
నా శక్తి చేతను - నా బలము చేతను నిన్ను ఆరాధించేదను 
జయము జయము జయము జయము ఏసు రక్తమే 
జయము జయము ఏసు నామమే (2)
||పరాక్రమ||

నాకై దిగి వచ్చి - నాకై మరణించి 
తిరిగి లేచిన విజయ వీరుడు
సతాను గుంపులను - దురాత్మ శక్తులను 
అణచి వేసిన అత్యున్నతుడు (2)
అన్ని నామములకన్న పై నామము 
నా యేసు నామము 
అతి సుందరమైన ఆశ్రయ దుర్గము 
నా యేసుని నిలయము (2) 
||జయము||

నా ఎదుట సంద్రమున్న - యేరికో గోడలున్న 
చీల్చి కూల్చువాడు మహిమొన్నతుడు 
తన మార్గము చూపి - అడ్డును తొలగించి 
నడిపించాడు అభిషిక్తుడు (2)
ఎన్ని శోధనలున్నా వేదనలున్న 
నమ్మదగిన వాడు 
తన చిత్తము నెరవేర్చి చిత్రము చూపెను 
నా ఏసు రాజు (2)
||జయము||

---------------------------------------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------------------------------------