5822) దాచబడినది దేవుని జ్ఞానం మరుగై ఉన్నది

** TELUGU LYRICS **

దాచబడినది దేవుని జ్ఞానం 
మరుగై ఉన్నది మహోన్నతుని చరితం (2)
ఆకాశమహాకాశాలు ప్రకటిస్తుంది ఆ జ్ఞానం 
సంత వీధులలో కేకలు వేయుచున్నది ఆ జ్ఞానం 
అజ్ఞానంతో నిండిన వాళ్ళకి అర్థంకానిది ఈ జ్ఞానం
||దాచబడినది||

అదృశ్యదేవుని స్వరూపమై 
సర్వసృష్టి ఆధారభూతుడై 
అన్నిటిని చేశాడు - అంతటన ఉన్నాడు
కలిగియున్నవి అన్నియు 
ఆయన వల్లే కలిగెనుగా 
జీవాన్ని నింపాడు - జీవిత గాథను నేర్పాడు (2)
వినుట వలన విశ్వాసము కలుగునని పలికే ఈ జ్ఞానం 
చెవిగలవాడు వినునుగాకని హెచ్చరించెను ఈ జ్ఞానం (2)
||దాచబడినది||

మహిమ కలిగిన మహాదేవుడే 
మానవ దేహం దాల్చాడు 
బలహీనతలను పొందాడు - బలవంతుడై గెలిచాడు .
పరలోకపు పరిశుద్ధుడే 
పాపులకై దిగివచ్చాడు 
తీవ్రత కలిగి బ్రతికాడు - తీర్పునకై నిలబడ్డాడు (2)
వినుట వలన విశ్వాసము కలుగునని పలికే ఈ జ్ఞానం . 
చెవిగలవాడు వినునుగాకని హెచ్చరించెను ఈ జ్ఞానం (2)
||దాచబడినది||

రక్తమార్గమే రక్షణార్థమని 
నీతినెత్తురు ఒలికించాడు 
రక్త నిబంధనకై వచ్చాడు - దత్త పుత్రులను చేశాడు.
వధ విధానం నేర్పినవాడే 
వధకై సిద్ధమయ్యాడు 
వంచనలేని ప్రాణాన్ని - వంచకులకై అర్పించాడు (2)
వినుట వలన విశ్వాసము కలుగునని పలికే ఈ జ్ఞానం .
చెవిగలవాడు వినునుగాకని హెచ్చరించెను ఈ జ్ఞానం (2)
దాచబడినది మరుగై ఉన్నది
||దాచబడినది||

---------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. A. Anil Kumar, T. Raju
Vocals & Music : Murali mohan & Sandeep Sunny
---------------------------------------------------------------------------------