5821) నా సహాయం నీవే యేసయ్య నా ఆశ్రయం నీవే యేసయ్య

** TELUGU LYRICS **

నా సహాయం నీవే యేసయ్య 
నా ఆశ్రయం నీవే యేసయ్య 
నాకున్న ధైర్యం నీవే దేవ 
దేవ నా మొర ఆలకింపుము
నా ప్రార్థనకు చెవియొగ్గుము

Now it turned into a Wonderful Song.

నా సహాయం నీవే యేసయ్య 
నా ఆశ్రయం నీవే యేసయ్య 
నాకున్న ధైర్యం నీవే దేవ (2)
దేవ నా మొర ఆలకింపుము
నా ప్రార్థనకు చెవియొగ్గుము (2)

ఒంటరినై నేను ఉండగా
ఓదార్పుకై నే చూడగా
సహాయముకై మొరపెట్టగా
సహాయకుడవై నాకు ఉన్నావయ్యా 
||దేవా||

నా ప్రాణము కుంగిపోయిన
శ్రమలలో నలిగిపోయిన
ఏ నీడ నాకు లేకపోయినా
నా ఆశ్రయం నీవై ఉన్నావయ్యా
||దేవా||

నా తల్లితండ్రులు  విడిచిన
బంధువులు దూరమైన
స్నేహితులు మరచిన
నా ధైర్యం నీవై ఉన్నావయ్యా
||దేవా||

--------------------------------------------------------------------
CREDITS : Vocals : Nissi John
Music & Lyrics : KVJ Das & Angle Vinodhan
--------------------------------------------------------------------