5820) నీ కృప లేనిదే నే బ్రతుకలేను నీ కృప నాకు చాలును

** TELUGU LYRICS **

నీ కృప లేనిదే నే బ్రతుకలేను నీ కృప నాకు చాలును యేసయ్యా (2)
నా యేసయ్యా నా స్తుతి గానమా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్య (2) 
కృతజ్ఞత స్తుతులు నీకేనయ్య 
నీ కృప చాలు దేవా నీ ప్రేమ చాలు దేవా (2)

ఒంటరి పయనంలో నా కన్నీటిలో 
అవమానం దరిచేరి - కృంగియున్న వేళలో (2)
కన్నీరు తుడిచింది నీ కృపా
తోడుగా నిలిచింది నీ కృపా
మహిమ నిచ్చింది నీ కృపా
మహిమగ మార్చింది నీ కృపా (2)
మహిమగ మార్చింది నీ కృప 
నీ కృప చాలు దేవా - నీ ప్రేమ చాలు దేవా (2)
||నీ కృప లేనిదే||

వేవేల దూతలతో కొనియాడబడుచు 
ఇహమందు శుద్దులతో స్తుతియింపబడుచున్న (2) 
వేల్పులలో నీవంటి వారే లేరు 
ఇహమందు నీతోటి సమమేకారు
మహిమకు అర్హుడవు నీవే 
మహిమగల మహరాజువు నీవే (2) 
మహిమగల మహరాజువు నీవే
మహిమంతా నీకే దేవా నా స్తుతులు నీకే దేవా (2)
||నీ కృప లేనిదే||

నూతన యెరూషలేం నాదు గమ్యమే అని 
సీయోను రారాజా నేను నీదు రాజ్యము చేరి (2)
కన్నులారా నిన్ను చూచుచూ 
కనకంబుపై నేను విహరించుచు
నీదు నామ మహిమను ఘనపరచుచూ 
నీతోటి ఉండే భాగ్యం దయచేయుమా (2)
నీతోటి ఉండే భాగ్యం దయచేయుమా
మహిమంతా నీకే దేవా నా స్తుతులు నీకే దేవా (2)
||నీ కృప లేనిదే||

---------------------------------------------------------------------
CREDITS : Music : ‪Bhanu Pala
Lyrics, Tune, Vocals : John Wesly Pakalapati
---------------------------------------------------------------------