5793) నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా

** TELUGU LYRICS **

నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా ఆ... నా ప్రభువా ఆఆఆఆ...
నాలోన నీవు నీలోన నేను - కలకాలం నిలవాలని
ఆశించుచున్నది నా మది నిత్యము - నీతోనే గడపాలని (2)
నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా నా ప్రభువా (2) 
||నాలోన నీవు||

నా గానం నా ధ్యానం నీవే దేవా  - నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా (2)
మలినమైన నా హృదిని మార్చింది నీవే దేవా - నూతనమగు సృష్టిగా చేసింది నీవే (2)
ప్రభువా నా దేవా - ఈ స్థితికే ఆధారమా (2)
||నాలోన నీవు||

వేదనలో ఆదరణ నీవే దేవా - ఒంటరినై యున్నప్పుడు జత నీవే ప్రభువా (2)
పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే - ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే (2)
ప్రభువా నా దేవా - ఈ స్థితికే ఆధారమా (2)
||నాలోన నీవు||

నాకై మరణించింది నీవే దేవా - నా పాపం తుడిచింది నీవే ప్రభువా (2)
శిధిలమైన నన్ను నిలబెట్టింది నీవే - మధురమైన వాక్యంతో కట్టింది నీవే (2)
ప్రభువా నా దేవా - ఈ స్థితికే ఆధారమా (2)
||నాలోన నీవు||

--------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas K Chinnababu
Vocal & Music : Anwesha & Bannu
--------------------------------------------------------------------