5784) నీ సొగసు నా కోసమే స్వరూపం నా కోసమే

** TELUGU LYRICS **

నీ సొగసు నా కోసమే స్వరూపం నా కోసమే 
కొవ్వొత్తిల కరిగిందయ్యా నాకు నీ రూపమిచ్చుటకే 
సింహాసనం విడిచావు నీ సిలువను మోసావు 
మరణించి లేచావయ్యా నీదు రాజ్యము చేర్చుటకే 
నీ ప్రేమను చూపించి నను ఆకర్షించావయ్యా 
కనికరమును చూపించి నను క్షమించావయ్యా 
నీ రుధిరము చిందించి నను పరిశుద్ధ పరిచావయ్యా 
నా కొరకు గాయము నొంది స్వస్థపరచావయ్యా
అ.ప: యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఎడబాయని దేవుడవు నీవే 
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యుగయుగములకు రాజువు నీవే

నాకిచ్చుటకు నీవు రక్షణను తెచ్చావు
నా ఆత్మకు నిత్యజీవమిచ్చావు 
నాకేదియు నీవు కొదువ కానివ్వవు 
పరలోకమే నిత్య స్వాస్థ్యముగా ఇచ్చావు (2)
నేనడగక పోయినను నా అక్కరలుతీర్చావు 
నీదు మహిమను నాకొసగి నీ సొత్తుగ మార్చావు (2)
ఇంతగనను ప్రేమించుటకు నేనంతటి వాడనయ్యా 
అంతయు నా కొసగి ఆత్మ బంధుడవైనావయ్యా (2)

నన్ను వెలిగించుటకు నీవువెలుగుగా వచ్చావు 
ఈ లోకముకు నను వెలుగుగా మార్చావు 
మేలులతో నాప్రాణమును తృప్తిపరచావు 
సర్వాంగ కవచమును నాకు ధరింపచేసావు (2)
ఆత్మీయ పోరాటములో నాకు జయమునిచ్చావు 
విశ్వాసపు యాత్రలో నాకు తోడుగ నడిచావు (2)
ఇంతగ నను ప్రేమించుటకు నేనెంతటిదాననయ్యా 
అంతయు నాకొసగి ఆత్మ బంధుడవైనావయ్యా (2)

నాకివ్వకుండా నీలో ఏది దాచవయ్యా 
నీ సమస్తం నాకై అర్పించావయ్యా 
ఒక్క రక్త బొట్లైన నీలో లేకుండా 
నా పాప ప్రక్షాళణకై చిందించావయ్యా 
నీ ఋణము తీర్చలేనన్ని మేలులు చేసావు 
నను నీకు అర్పించిన నీ ఋణం తీర్చగలనా

--------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. J Kumar
Vocals & Music : M M Srilekha & Jakie Vardhan
--------------------------------------------------------------------------