5783) నీ సిలువే నన్ను మార్చెను నీ రక్తమే నన్ను రక్షించెను

** TELUGU LYRICS **

నీ సిలువే నన్ను మార్చెను 
నీ రక్తమే నన్ను రక్షించెను (2)
వర్ణించలేనయ్య నీ ప్రేమను - వివరించలేనయ్య నీ విలువను (2)

ఊహాకందని సిలువ భారము - ఆ ప్రేమే నన్ను కాపాడెను (2)
వెలకట్టలేనయ్య కల్వరి ప్రేమను (2)
నా కోసమే కదా - ఆ కల్వరి వేదన (2)
నన్ను రక్షించుటకు (2)

ఏ నేరము చేయని నీవు - నా పాపాన్ని మోసితివ (2)
భరియించితివ నా దోషమును (2)
నా కోసమే కదా - ఆ కల్వరి వేదన (2) 
నన్ను కాపాడుటకు (2)

---------------------------------------------------------------------------------------
CREDITS : Vocals, Tune : Sis. Kezia
Lyrics & Music : Ch. Suvartha Steeven & Vijay Polamuri
--------------------------------------------------------------------------------------