5782) విమలనాధుడ నా ప్రాణప్రియుడ మహిమలో నివసించే

** TELUGU LYRICS **

విమలనాధుడ నా ప్రాణప్రియుడ 
మహిమలో నివసించే (నా) రారాజువు నీవయ్యా
ప్రేమనే కురిపించే ప్రియదైవం నీవయ్యా
(నా) ఆరాధన నీకే యేసయ్యా
స్తుతి ఘనత నీకే యేసయ్య

చేదుగా ఉన్న నన్ను మధురమై వెంటాడావు
జీవితము మాదిరి చూపి హృదయమును గెలిచావు 
నా గడియలను జనములకు ప్రయోజనముగ ఎంచావు
ఊహలకే అందనిది నాపై నీ సంకల్పం
నీ సాక్ష్యం నీ స్నేహం చూడలేదు మనుష్యులలో
||ఆరాధన||

వానలే కురిసినగాని వరదలే వచ్చినగాని
ఇంటినే పడవేసేటి గాలియే విసిరినగాని
పునాదిని క్రీస్తు అనే బండ మీద కట్టావు
వేధించే భయములను దినదినము అణిచావు
నీ శౌర్యం నీ శాంతం చూడలేదు మనుష్యులలో
||ఆరాధన||

ఎవ్వరూ ఆపలేని వెలుగుగా మార్చినావు
శాపముకు ఇష్టములేని దీవెనగ చేసినావు
(నా) ప్రయాసకు నీ కృపను జతకలిపి నడిపావు
కార్యాలు జరిగించి నీ ఋజువును చూపావు
నీ సాయం నీ సహనం చూడలేదు మనుష్యులలో
||ఆరాధన||

-----------------------------------------------------------
CREDITS : Music, Tune  : Daniel John
Lyrics, Vocals : Bro. Prakash Garu 
-----------------------------------------------------------