5801) నీ కృపయే యేసయ్యా నే ఉండుటకు నీ దయవలనేనయ్యా

** TELUGU LYRICS **

నీ కృపయే యేసయ్యా నే ఉండుటకు  
నీ దయవలనేనయ్యా నే బ్రతుకుటకు (2)
నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో (2)
నీవు ఉంటే చాలయ్యా నా మంచి యేసయ్యా  
||నీ కృపయే||

గడచిన కాలమంతా నన్ను నీవు చూచావు 
నా కన్నీరునంత నాట్యముగా మార్చావు (2)
నీకు అసాధ్యమైనది ఇల లేనే లేదయ్యా 
నీ మేలులతో నా హృదయం నింపావయ్యా (2)
||నీ కృపయే||

నా శత్రువులే నన్ను తరుముచుండెనే
నా పక్షముగా నీవే నిలచితివే (2)
నా వేదనలన్నియు తొలగిచినవయ్యా
అవమానభారములు దీవెనగా మార్చావు (2)
||నీ కృపయే||

----------------------------------------------------------
CREDITS : Music : Vinay
Lyrics, Tune, Vocals : Syam Williams  
----------------------------------------------------------