5777) నలుగగొట్టబడితివయా యేసయ్య నా దోషమంతా

** TELUGU LYRICS **

నలుగగొట్టబడితివయా యేసయ్య 
నా దోషమంతా తండ్రి నీపై మోపగా (2)
నీ వీపు దున్నబడెను గదయా (2)
కోరాడ దెబ్బలు నిన్ను చీల్చివేయగా (2)
ఇది నా దోష శిక్ష ఇది నా పాప ఫలితము (2)
యేసయ్య నా యేసయ్య నా విమోచకూడా 
         
కార్చినవాయా నీ రుదిరమంత కలియెనవు నన్ను నీ కృపతో నింపవు (2)
గాయాలలోనే నిలువెల్ల నీవు (2)
గోర మరణ మొందవు దోషిగా నిలిచావు (2)
ఇది నా దోష శిక్ష ఇది నా పాప ఫలితము (2)
యేసయ్య నా యేసయ్య నా విమోచకూడా

పరమ తండ్రి నిన్ను చేయి విడిచెను 
పాత్రలోని పాపమంత నీవు పుచ్చు కొనగా (2)
బంధించేను సిలువలో నిన్ను (2)
బాధించేను సొమ్మసిల్లునంతగా (2)
ఇది నా దోష శిక్ష ఇది నా పాప ఫలితము (2)
యేసయ్య నా యేసయ్య నా విమోచకూడా 

తండ్రి చిత్తమంత నెరవేర్చినవు 
విదేయుడవై మరణించినవు (2)
నిర్దోషిగా నన్ను చేసినావు (2)
జయశిలుడవై జయనొందినవు 
జయశిలుడవై విజయమొందినవు 
ఇది నీ త్యాగము అది నాకు జీవము (2)

---------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. K. Salman Raju 
Music & Vocals : Sudhakar Rella & Bro Chinny Savarapu 
--------------------------------------------------------------------------------------