5842) నాపైన చూపించే నీ ప్రేమ వాత్సల్యము

** TELUGU LYRICS **

నాపైన చూపించే
నీ ప్రేమ వాత్సల్యము
విలువెంతో వివరించ గలనా
నా కొరకే దిగివచ్చి
నా శిక్షను భరియించిన
నీ ప్రేమ వర్ణించగలనా
ధరలోన ఎవ్వరు చూపలేని ప్రేమతో
నిలువెల్ల పులకించితి దేవా

స్తన్యమిచ్చు తల్లి 
తన బిడ్డను మరచినా
నేను నిన్ను మరువనన్న దేవా
చూడుము అరచేతిలో
నిన్ను చెక్కియున్నానని
మాట ఇచ్చి ప్రేమ  చూపినావు
అనుదినము నాపైన 
నూతన వాత్సల్యము
చూపించ నాదెంత భాగ్యం

తప్పిపోతినయ్య
తండ్రియైన నిను వీడి
తడబడెను నా జీవిత నావ
తప్పులన్ని క్షమియించ
తనయుడనే కాదయ్య
తండ్రీ నే పాపినని వేడగా
తరగని నీప్రేమతో
తరియింప జేయుటకు
తండ్రీ నాదెంత భాగ్యం

ఎగసి పడే అలలు
ఎదురైన పయనం లో
ఏసయ్య నీవుండగ నా దోనెలో
నశియించు చున్నాను
నజరేయా కరుణించని
నాధా నిను వేడుకున్న వేళ
గాలిని గద్దించి నిమ్మళింపజేసావే
నా దేవ నాదెంత భాగ్యం

------------------------------------------------------------------------
CREDITS : Vocals : Shree MM Srilekha
Tune & Music : Nallipogu Smaran & N Thomas
------------------------------------------------------------------------