5843) నా నమ్మకం నీవే నా బలము నీవే

** TELUGU LYRICS **

నా నమ్మకం నీవే - నా బలము నీవే 
నా ధైర్యము నీవే - నా ద్వాజము నీవే 
ఎప్పుడూ నిలిచే నీ విశ్వాస్యత
నన్ను ఉప్పొంగించే నిదు ప్రసన్నత
ఒక్క క్షేణమైన నీవు నన్ను విడువక 
ప్రతి అడుగులలో నా తోడుంటివి 
అందుకే నీవే నా నమ్మకం యేసు

నీ దయతో నన్ను తాకినప్పుడు – నా కళ్లలో వెలుగు
నీ ప్రేమతో నన్ను మోసినప్పుడు – నా గుండెలో ఉత్సాహం
ఆశలే లేని స్థితిలో - దీవెన వర్షం కురిపించితివి 
ప్రయాసే మిగిలే స్థితిలో - ఆశీర్వదం కుమ్మరించితివి 
విరిగి నలిగిన మనసులను బాగు చేసేవాడా 
ఎండిన బ్రతుకును జీవ జలములతో నింపేవాడా 
అందుకే నీవే నా నమ్మకం యేసు

నా హృదయ ప్రాణేశ్వరా - నీ కొరకే ఈ జీవితం 
నీ పైనే ఉంచిన నమ్మకం - వ్యర్థము కాలేదయ్య 
కష్టాలే నను కదిలించిన - స్థితియే చేజారిపోయిన
నా శరణు నీవే నా దేవుడా - నీవుంటే చాలయ్య 

శత్రువులే నన్ను తరుముచుండగా - నా దాగు చోటు నీవే 
రోగములే నన్ను క్రుంగదీయగా - నీ చెయ్యి నా స్వస్థత (2)
నా నడకను నా పడకను నీ రెక్కలతో ఆశ్రయించితివి 
నా వెనుకను నా ముందును నీవు నన్ను ఆవరించితివి 
అసాధ్యము సాధ్యముగాను మరణము జీవముగాను చేసేవాడా 
నా పక్షమున నిలిచి - శత్రువులను తరిమి కొట్టేవాడా 
అందుకే నీవే నా నమ్మకం యేసు

----------------------------------------------------------
CREDITS : Vocals : John Paul Chepa 
Music : Sandeep Roy 
Lyrics, Tune : Charles Dany Premson
----------------------------------------------------------