** TELUGU LYRICS **
నా ప్రతి అడుగు నీ దయలో సాగెనే
నీ ప్రేమతో నా హృదయం పొంగెనే
ప్రతి క్షణం నీ వాక్యమే
నన్ను బలపరచు ఆహారము
నిరంతరం నీ సన్నిధే
నాకు సంపూర్ణ ఆనందము
యేసయ్యా నా దేవా
నను నడిపే నాయకుడా (2)
చీకటిలో వెలుగైనావు
చేయ్యి పట్టి నన్ను నడిపించావు
నా అడుగులనే స్థిరపరచావు
నీ వాగ్దానం నెరవేర్చావు
దారి తొలిగి వీడి పోయిన
ద్వారమునే నిలిచి వేచావూ
దూరమునే చూచి పరుగెత్తుకొని వచ్చి
హత్తుకొనీ ముద్దాడావూ
నా తండ్రి నా నాధా ప్రేమించే పోషకుడా (2)
నీ ప్రేమతో నా హృదయం పొంగెనే
ప్రతి క్షణం నీ వాక్యమే
నన్ను బలపరచు ఆహారము
నిరంతరం నీ సన్నిధే
నాకు సంపూర్ణ ఆనందము
యేసయ్యా నా దేవా
నను నడిపే నాయకుడా (2)
చీకటిలో వెలుగైనావు
చేయ్యి పట్టి నన్ను నడిపించావు
నా అడుగులనే స్థిరపరచావు
నీ వాగ్దానం నెరవేర్చావు
దారి తొలిగి వీడి పోయిన
ద్వారమునే నిలిచి వేచావూ
దూరమునే చూచి పరుగెత్తుకొని వచ్చి
హత్తుకొనీ ముద్దాడావూ
నా తండ్రి నా నాధా ప్రేమించే పోషకుడా (2)
||నా ప్రతి||
పరమును వీడి అరుదెంచావు
తండ్రి చిత్తమే నెరవేర్చావు
నీ ప్రాణమునే వేలగా చెల్లించావు
నా ప్రాణమునే విమోచించావు
నా పాపమునే భరియించావు
శిలువలొ నీ రక్తము చిందించావు
మరణమునే గెలిచి మృత్యుంజయుడై లేచి
జీవమునె నాకిచ్చావు
రక్షకుడా ఆశ్రయుడా ప్రాణం పెట్టిన స్నేహితుడా(2)
||నా ప్రతి||
------------------------------------------------------
CREDITS : Music: Ch. Salem Raju
Lyrics, Vocals : Dr. M. K. Sandeep
------------------------------------------------------